2 నిమిషాల 15 సెకండ్ల నిడివి గల ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఆకట్టుకుంది. తనకు వచ్చిన సమస్య పై జయమ్మ పంచాయితీ పెట్టడం, గ్రామ పెద్దలు జయమ్మ సమస్యని తేలికగా తీసుకోవడం, జయమ్మ ఎదురు తిరగడం.. ఇలా కథ, సినిమా పై ఆసక్తిని పెంచేలా ట్రైలర్ వుంది. ఉత్తరాంధ్ర మాండలికంలో సాగిన సంభాషణలు ఆసక్తికరంగా వున్నాయి. 'ఎవరు వల్ల సెడ్డావురా వీరన్న అంటే నోటి వల్ల సెడ్డానురా కాటమరాజా' అని జయమ్మ పలికిన డైలాగ్ నవ్వులు పూయించింది. ట్రైలర్ లో వినిపించిన డైలాగ్స్ ని నటులంతా ఉత్తరాంధ్ర మాండలికంలో చక్కగా పలికారు.
జయమ్మపాత్రలో సుమ కనిపించిన తీరు అద్భుతంగా వుండటంతో పాటు సహజంగా, ప్రేక్షకులు చాలా సులువుగా ఆ పాత్రని కనెక్ట్ చేసుకునేలా వుంది. దర్శకుడు ఒక వైవిధ్యమైన కథని ఈ చిత్రంతో ప్రేక్షకులకు చూపించబోతున్నారనే విషయం ట్రైలర్ చూస్తే అర్ధమౌతుంది. ఎంఎం కీరవాణి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంది.