డ్రగ్స్ కేసులో మరో నటుడు అరెస్టు అయ్యాడు.

ఠాగూర్

శనివారం, 28 సెప్టెంబరు 2024 (13:26 IST)
డ్రగ్స్ కేసులో మరో నటుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ నటుుడ పేరు అభిషేక్. "ఐతే" సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన అభిషేక్.. ఆతర్వాత "డెంజర్",  "నువ్వోస్తానంటే నేవద్దంటానా" వంటి అనేక చిత్రాల్లో నటించాడు. పలు సినిమాల్లో అతను సహాయక పాత్రల్లో నటించాడు. 2012 నుంచి ఎస్ఆర్ నగర్, జూబ్లీహిల్స్ పీఎస్‌లో డ్రగ్స్ కేసుల్లో నిందితుడుగా ఉన్న అభిషేక్ కోర్టు కేసులకు హాజరుకాకపోవడంతో వారెంట్స్ జారీ అయ్యాయి. అతని పరారీలో ఉండటంతో ఎప్పటినుంచో అభిషేక్‌ కోసం గాలిస్తున్నారు.

అతని పరారీలో ఉండటంతో.. ఎప్పటినుంచో అభిషేక్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు. చివరకు అభిషేక్ రాష్ట్రం నుంచి పారిపోయి గోవాలో రెస్టారెంట్ నిర్వహిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. దాంతో యాంటీ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ప్రత్యేక బృందం గోవా వెళ్ళి మరీ అభిషేక్‌ను అరెస్టు చేసింది. అనంతరం గోవా నుంచి అతన్ని హైదరాబాద్ కు తరలించారు.  అతన్ని కోర్టు ముందు హాజరుపరచనున్నారు.
 
ఇంతకీ "దేవర" హిట్టా.. ఫట్టా...? తొలి రోజు కలెక్షన్లు ఎంత...?
 
జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం దేవర. శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా మూవీగా విడుదలైంది. జాన్వీ కపూర్ హీరోయిన్. ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ టాక్ వచ్చింది. ఫ్యాన్స్ మాత్రం అదిరిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. కానీ సగటు ప్రేక్షకుడు మాత్రం చిత్రం పోయిందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా సినిమా బాక్సాఫీస్ వద్ద పూర్తిగా నిరాశపరిచిందనే టాక్ బలంగా వినిపిస్తుంది. 
 
ఇదిలావుంటే, ఆర్ఆర్ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటించిన చిత్రం కావడంతో ఈ చిత్రంపై ఆది నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలను ధీటుగానే తొలిరోజు కలెక్షన్లను రాబట్టింది. దేశ వ్యాప్తంగా రూ.77 కోట్లను వసూలు చేయగా, ప్రపంచ వ్యాప్తంగా రూ.140 గ్రాస్ వసూళ్లను రాబట్టినట్టు ఫిల్మ్ ట్రేడ్ వర్గాల సమాచారం. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ నుంచే రూ.68 కోట్లకుపైగా కలెక్షన్లు వచ్చినట్టు సమాచారం. 
 
కాగా, ఈ మూవీలో తార‌క్ స‌ర‌స‌న శ్రీదేవి కుమార్తె జాన్వీ క‌పూర్ హీరోయిన్‌గాను, విలన్‌గా బాలీవుడ్ స్టార్‌ సైఫ్‌ అలీఖాన్ క‌నిపించారు. ప్రకాశ్ రాజ్‌, శ్రీకాంత్‌, మురళీ శర్మ, మలయాళ న‌టుడు షైన్ టామ్ ఛాకో త‌దిత‌రులు ఇతర కీలక పాత్రలు పోషించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ‌సుధ ఆర్ట్స్ బ్యానర్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి అనిరుధ్ ర‌విచంద‌ర్ బాణీలు అందించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు