ఈ నేపథ్యంలో తాజాగా మరో హీరోయిన్ లైంగిక వేధింపుల అంశంపై నోరు విప్పింది. తానెప్పుడూ లైంగిక వేధింపులు ఎదుర్కోలేదని, అయితే దాని గురించి విన్నానని కాజోల్ అంటోంది. వేధించినవారు ఎవరైనా బయటకొచ్చి మేం ఇటువంటి పని చేశామని చెప్పుకోరు కదా అని ఆమె వ్యాఖ్యానించింది.
తన కళ్ల ముందు ఇలాంటి ఘటన జరిగితే చూస్తూ ఉండేదాన్ని కాదని, తప్పకుండా ఏదో ఒకటి చేసేదాన్నని తెలిపింది. అయితే లైంగిక వేధింపులు అనేవి కేవలం చిత్ర పరిశ్రమకు మాత్రమే పరిమితం కాలేదని, అన్ని రంగాల్లో ఉన్నాయని కాజోల్ చెప్పుకొచ్చింది. లైంగిక వేధింపులకు నిలిపేసేందుకు విదేశాల్లో తీసుకొచ్చిన మీ టూ ఉద్యమంలాంటిది మన దగ్గర కూడా రావాల్సిన అవసరముందని ఆమె అభిప్రాయపడింది.