తనుశ్రీ వివాదం గురించి అమితాబ్‌ను మీడియా ప్రశ్నించగా 'నేను నానా పటేకర్‌ను కాదు, తనుశ్రీని కాదు.. అలాంటప్పుడు నేనెలా స్పందిస్తాను' అని సమాధానమిచ్చారు. దీంతో తనుశ్రీకి కోపం వచ్చింది. 'ఒక మహిళకు జరిగిన అన్యాయం గురించి కనీసం స్పందించని ఇలాంటి వారు పెద్ద హీరోలా? ఇలాంటి వాళ్లా సామాజిక సందేశాల పేరుతో సినిమాలు చేసేది? సినిమాల్లో ఎన్నో పాత్రలు పోషిస్తారు. కానీ, కళ్ల ముందు జరుగుతున్న అన్యాయాల గురించి కనీసం స్పందించరు. అమితాబ్ అన్న మాటలు నాకు చాలా బాధ కలిగించాయ'ని తనుశ్రీ చెప్పింది.