నా పెళ్లి క్యాన్సిల్ అయ్యిందా.. గీత గోవిందం రష్మిక

శుక్రవారం, 17 ఆగస్టు 2018 (15:02 IST)
గీత గోవిందం సినిమాలో విజయ్‌తో రొమాన్స్ పండించిన హీరోయిన్ రష్మిక.. తనకు జరిగిన నిశ్చితార్థాన్ని బ్రేక్ చేసుకుందని., కన్నడ నటుడు రక్షిత్‌తో జరిగిన ఎంగేజ్‌మెంట్ ఆగిపోయిందని.. సినిమాల కోసం ప్రేమ, పెళ్లిని రష్మిక పక్కనబెట్టేసిందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగింది. ఈ నేపథ్యంలో తన పెళ్లి ఆగిపోయిందని వస్తున్న వార్తలపై రష్మికా మందన స్పందించింది.
 
ఈ వార్తలను వింటుంటే తనకు నవ్వు వస్తుందని చెప్పింది రష్మికా. కొత్త చిత్రం గీత గోవిందం సినిమా సూపర్ హిట్‌ను సాధించిన సందర్భంగా ఆ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న రష్మికా... నిశ్చితార్థం జరిగినప్పుడే రెండున్నరేళ్ల తరువాత వివాహం చేసుకోవాలని అనుకున్నామని చెప్పింది.  
 
నటనలో బిజీగా ఉండడంతో ఎప్పుడు వివాహం చేసుకోవాలన్న తేదీలను నిర్ణయించుకోలేదని రష్మిక క్లారిటీ ఇచ్చింది. గీత గోవిందం సినిమా కోసం ఏడున్నర నెలలు పనిచేశానని, చివరి 15 రోజులు మాత్రమే సరదాగా గడిపానని చెప్పింది. 
 
ఈ చిత్రాన్ని చాలామంది హీరోయిన్లు వదిలేసుకున్నారని, వాళ్లు ఎందుకు కాదన్నారో తనకు తెలియదని రష్మిక చెప్పింది. ప్రస్తుతం రష్మిక మందన తెలుగులో డియర్ కామ్రేడ్, దేవదాస్ చిత్రాలలో నటిస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు