మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం "ఖైదీ నంబర్ 150". ఈ చిత్రం ఆడియోలో భాగంగా, ఇప్పటికే మొదటి పాటను విడుదల చేశారు.. 'అమ్మడు లెట్స్ డు కుమ్ముడు' పేరుతో ఈ ఆడియో సాంగ్ యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. పక్కా మాస్ సాంగ్‌గా సాగే ఈ పాటకు నెటిజన్లు బ్రహ్మరథం పట్టారు.
ఆడియో రిలీజ్ ఫంక్షన్ లేకపోవడంతో ఒక్కో సాంగ్స్‌ని రిలీజ్ చేస్తూ సినిమాకి హైప్‌ని క్రియేట్ చేస్తున్నట్లు చిరు ఫ్యాన్స్‌లోని ఓ వర్గం చెబుతున్నమాట. మరి అమ్మడు సాంగ్‌ని "ఈ సుందరి మల్లి తీగ" అధిగమిస్తుందో లేదో చూడాలి. ఈ చిత్రంలో హీరోయిన్ కాజల్ అగర్వాల్ కాగా, వీవీ వినాయక్ దర్శకుడు.