ఏ హీరో అడిగినా నో చెప్పింది. చరణ్ అడిగితే మాత్రం ఎస్ అంది. ఎందుకనో..?
గురువారం, 19 మార్చి 2020 (10:33 IST)
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న కొత్త సినిమా ఆచార్య. ఈ చిత్రానికి అపజయం అనేది ఎరుగని సక్సస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో కీలక పాత్ర ఉందని.. ఆ పాత్రను సూపర్ స్టార్ మహేష్ బాబు చేయనున్నాడు అని గత కొన్ని రోజులుగా వార్తలు వచ్చాయి.
ఈ వార్తలు బయటకు వచ్చినప్పటి నుంచి మెగాస్టార్ మూవీలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించనున్నాడా...? ఇది నిజమేనా..? అంటూ అటు అభిమానుల్లోను, ఇటు ఇండస్ట్రీలోను ఇదే హాట్ టాపిక్ అయ్యింది. దీంతో ఈ సినిమా పై అప్పటి వరకు ఉన్న అంచనాలు రెట్టింపు అయ్యాయని చెప్పవచ్చు.
మహేష్ బాబు ఈ సినిమా కథ, ఈ సినిమాలోని అతని క్యారెక్టర్ విని ఓకే చెప్పాడని టాలీవుడ్‌లో టాక్ రావడంతో అటు మెగా అభిమానులు, ఇటు మహేష్ అభిమానులు అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ ఎప్పుడు వస్తుందా..? అని ఎంతో ఆత్రుతగా ఎదురు చూసారు. 40 రోజులు డేట్స్ కూడా ఇచ్చాడు. మే నెలాఖరు నుంచి రామోజీ ఫిలింసిటీలో జరిగే షూటింగ్ జాయిన్ అవుతాడని వార్తలు రావడంతో ఇక అధికారిక ప్రకటన రావడమే ఆలస్యం అనుకున్నారు.
అయితే... కొరటాల ఈ సినిమాలోని కీలక పాత్రను మహేష్ చేస్తే బాగుంటుంది అంటే.. చిరంజీవి మాత్రం చరణ్ చేస్తేనే బాగుంటుందని.. చెప్పారని.. అందుచేత ఫైనల్ గా చరణ్ తోనే ఆ కీలక పాత్రను చేయిస్తున్నారని తెలిసింది.
చరణ్ ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో పాల్గొనాలి. ఆర్ఆర్ఆర్ షూటింగ్ ను మే నెలాఖరుకి కంప్లీట్ చేసి జూన్ నుంచి ఆచార్య షూటింగ్ లో చరణ్ జాయిన్ అవ్వాలనేది ప్లాన్ కానీ.. ప్రస్తుతం షూటింగ్స్ ఆపేయడం వలన ఆర్ఆర్ఆర్ షూటింగ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందో..? చరణ్ ఆచార్య షూటింగ్ లో ఎప్పుడు జాయిన్ అవుతారో ఇప్పుడు చెప్పలేని పరిస్థితి.
ఇదిలా ఉంటే.. ఇక చరణ్ కు జోడీగా హీరోయిన్ ఎవరు నటించబోతున్నారు అనే చర్చ మొదలైంది. పలువురు హీరోయిన్స్ ను పరిశీలించిన తర్వాత ఈ గెస్ట్ హీరోయిన్ రోల్ కోసం కియారా అద్వానీని ఓకే చేసినట్లుగా సమాచారం. చరణ్, కియారా అద్వానీ కలిసి వినయ విధేయ రామ సినిమాలో నటించారు.
అప్పటి నుంచి వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. వీరిద్దరి మద్య స్నేహం ఏర్పడటం వలనే ఆమె బర్త్ డేకు ముంబయికి చరణ్ వెళ్లడం తెల్సిందే. ఇన్ని రోజులు టాలీవుడ్ నుండి పలు ఆఫర్లు వచ్చినా కూడా నో చెబుతూ వచ్చిన కియారా అద్వానీ చరణ్ నుండి ఆఫర్ రాగానే వెంటనే ఓకే చెప్పిందని తెలిసింది. ఎందుకనే అది చరణ్, కియారాకే తెలియాలి.