"కొడకా... కోటేశ్వర్రావూ ఖరుచైపోతవురో" అంటున్న పోలెండ్ బుజ్జి.. పవన్ ఫిదా

శుక్రవారం, 5 జనవరి 2018 (10:12 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తాజా చిత్రం "అజ్ఞాతవాసి". ఈ చిత్రం ఈనెల 10వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ఇందులో పవన్ కళ్యాణ్ ఓ పాటపాడారు. "కొడకా... కోటేశ్వర్రావూ ఖరుచైపోతవురో" అనే బాణీలో సాగిన ఈ పాటను ఇటీవలే విడుదల చేశారు. ఈ పాట పాత చిత్రాల రికార్డులన్నీ తిరగరాస్తూ పెను సంచలనంగా మారింది.
 
ఈ నేపథ్యంలో జిబిగ్స్ అనే పోలెండ్‌కు చెందిన బుడతడు ఒకడు "కొడకా... కోటేశ్వర్రావూ ఖరుచైపోతవురో" అంటూ పాడాడు. ఇంది ఎంతో వైరల్ అయింది. తాజాగా, జిబిగ్స్ వీడియోను పవర్ స్టార్ కూడా చూశారు. తన యువ అభిమాని పాడిన పాటకు ఫిదా అయిపోయారు. ఆ యువకుడిని అభినందిస్తూ ఓ మెసేజ్ పెట్టారు.
 
"డియర్ జిబిగ్స్ బుజ్జీ... నా చిన్న స్నేహితుడా... నువ్విచ్చిన నూతన సంవత్సరం బహుమతికి నా కృతజ్ఞతలు. నీ సందేశం నాకు చేరింది. నీకు దేవుడి ఆశీర్వాదం లభిస్తుంది.. పవన్ కల్యాణ్" అంటూ తన "పీకే క్రియేటివ్ వర్క్" అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టు ఉంచారు. ఆ కుర్రాడు పాడిన పాట లింక్‌ను కూడా ఉంచారు. 
 
 

Dear zbigsbujji, My dear little friend Thankyou for your New Year gift. Your message has reached me.May God bless you! - Pawan Kalyan https://t.co/G2ZZZhjGo1

— PK Creative Works (@PKCreativeWorks) January 4, 2018

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు