అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

సిహెచ్

సోమవారం, 31 మార్చి 2025 (13:39 IST)
క్రెడిట్: ఫ్రీపిక్
ఈమధ్యకాలంలో పంటలను రకరకాల ఫంగస్ పట్టుకుంటుంది. వీటి బారిన పడిన పంటలను పొరబాటున తింటే ప్రాణాంతకమైన కేన్సర్ వ్యాధి సోకే ప్రమాదం వుందని నిపుణులు చెబుతున్నారు. వీటిలో ముఖ్యంగా మనం నిత్యం వాడే ఎండుమిరప కాయలు, వేరుశనక్కాయలు, మొక్కజొన్న వంటి ప్రధానమైన పంటలు వున్నాయి. అఫ్లాటాక్సిన్ అనే ఒక రకమైన ఫంగస్ ఎండుమిర్చి, వేరుశనగ, మొక్కజొన్న పంటలను ఆశిస్తున్నట్లు కనుగొన్నారు. 
 
ఈ ఫంగస్ సోకిన ఎండుమిర్చి చూసేందుకు నల్లటి మచ్చలు లేదా పసుపు రంగులో గుల్లబారినట్లు అగుపిస్తాయి. ఎండుమిరప కాయలు అలాంటివి కనబడితే వాటిని కొనకుండా వుండటమే మంచిది. ఎందుకంటే అలా మచ్చలు, పసుపు రంగులో వున్న కాయలపై ఈ ఫంగస్ పట్టుకుని వుంటుంది. మనం వాటిని కూరల్లో వేసుకున్నప్పుడు ఈ ఫంగస్ కాస్తా మన జీర్ణాశయానికి చేరుతుంది.
 
ఫలితంగా జీర్ణ సమస్యలతో పాటు కాలేయ కేన్సర్ వచ్చే ప్రమాదం వుందని చెబుతున్నారు. అదేవిధంగా వేరుశనక్కాయలు కొనుగోలు చేసేటపుడు కూడా జాగ్రత్త వహించాలి. నల్ల మచ్చలు, పసుపు మచ్చలతో వున్నటువంటి కాయల జోలికి వెళ్లకుండా వాటిని దూరం పెట్టాలి. ఐతే బాగా ఎండబెట్టడం, వేయించడం వంటి పద్ధతుల ద్వారా ఈ ఫంగస్ కాస్త తగ్గే అవకాశం వుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు