Clap by Komatireddy Venkata Reddy
రుత్విక్ కొండకింది, విశాఖ దిమాన్ హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతున్న చిత్రం "రాజా ది రాజా". మణికాంత్ గెల్లి దర్శకత్వం వహిస్తున్నారు. చాణక్య అద్దంకి, నిహారిక రెడ్డి నిర్మాతలు. ఇవాళ హైదరాబాద్ లో లాంఛనంగా ప్రారంభమైంది. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దర్శకులు రవి బాబు, ఎస్వీ కృష్ణారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.