కొండపొలం నుంచి రొమాంటిక్ సాంగ్ రిలీజ్ - రకుల్‌తో తేజ్ రొమాన్స్!
శుక్రవారం, 1 అక్టోబరు 2021 (09:46 IST)
'ఉప్పెన' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వైష్ణవ్ తేజ్ నటిస్తున్న చిత్రం 'కొండపొలం'. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. ఈ సినిమా నుంచి మరో సాంగ్ విడుదలైంది.
'నీలో నాలో.. శ్వాసలో' అంటూ సాగే ఈ పాట వీనుల విందుగా సాగుతోంది. ఎం.ఎం. కిరవాణి అందించిన ఈ పాటను వినేకొద్ది వినాలనిపిస్తోంది. యామినీ ఘంటశాల, పీవీఎన్ఎస్ ఈ పాటను ఆలపించారు. ఈ పాటకు కీరవాణే స్వయంగా లిరిక్స్ అందించడం గమనార్హం.
మాంచి రొమాంటిక్ కలిగించే ఈ పాట యూత్‌కు తప్పకుండా నచ్చేస్తుంది. ఈ పాటను చూస్తుంటే.. క్రిష్ మాంచి విజువల్ వండర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. ఇంకెందుకు ఆలస్యం ఆ పాటను మీరూ చూసేయండి మరి.