- ఓ సారి రాఘవేంద్ర రావు గారు ఫోన్ చేసి రోషన్ గురించి అడిగారు. ఇంకా చిన్నపిల్లవాడే కదా? అని అన్నారు. అది పదేళ్ల క్రితమండి.. ఇప్పుడు కాదు అని అన్నాను. ఓసారి నా దగ్గరికి తీసుకురావా? అని అడిగారు. అలా మేం ఇద్దరం వెళ్లాం. పెళ్లి సందడి ఫ్లేవర్‌తో అదే టైటిల్ పెట్టి సినిమా తీసేందుకు స్క్రిప్ట్ వరకు కూడా రెడీ అయింది. రోషన్ కోసం అనే కాదు కానీ కథను రెడీ చేసుకున్నారు. కానీ మధ్యలో ఎవరో చెప్పినట్టున్నారు. శ్రీకాంత్ కొడుకు అయితే బాగుంటుందని అన్నట్టున్నారు. అలా రోషన్‌ను చూసి.. కరెక్ట్‌గా సరిపోయాడు.. ఈ ఏజ్ ఉండాలనే అనుకున్నానని రాఘవేంద్రరావు గారు అన్నారు. అలా సినిమా ఆఫర్ వచ్చింది.
- ఇప్పుడు వస్తున్న జానర్లకంటే కొత్తగా ఉంటుంది. పెళ్లిలో ఉండే గోల, ఆ సందడి, కామెడీ, వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్ పాత్ర ఇలా అన్నీ బాగుంటాయి. మహిళా ప్రేక్షకులందరూ కూడా వచ్చి చూసే చిత్రమవుతుంది. ఎఫ్ 2 సినిమా ఎంత ఫ్రెష్‌లా అనిపించిందో.. పెళ్లి సందD కూడా అంతే ఫ్రెష్‌గా ఉంటుంది. సాంగ్స్, ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్స్ ఇలా అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. ఇందులో బాస్కెట్ బాల్ ప్లేయర్‌గా రోషన్ కనిపించబోతోన్నారని తెలిపారు.