శివశంకర్‌ మాస్టర్ ఆరోగ్యంపై సోనూ సూద్ సాయం... మంచు విష్ణు మాత్రం కేవ‌లం ట్వీట్‌!

శుక్రవారం, 26 నవంబరు 2021 (16:52 IST)
ప్రముఖ డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్‌ శివశంకర్ మాస్టర్ అనారోగ్యంతో ఆసుప‌త్రి పాల‌వ‌గా, ఆయ‌న‌కు ఎక్క‌డో ఉన్న బాలీవుడ్ న‌టుడు సంఘీభావం తెలిపారు. కానీ, ఇక్క‌డున్న తెలుగు న‌టులు మాత్రం కేవలం ట్వీట్ ల‌తో కాల‌క్షేపం చేస్తున్నారు. 
 
 
శివ‌శంక‌ర్ ఆరోగ్యంపై ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు ట్వీట్‌ చేశారు. శివశంకర్‌ మాస్టర్‌ చికిత్స పొందుతోన్న ఏఐజీ ఆస్పత్రి బృందంతో తాను  ఫోన్‌లో మాట్లాడినట్లు విష్ణు తెలిపారు. 
 
 
‘‘ఏఐజీ ఆస్పత్రి బృందంతో మాట్లాడాను. శివశంకర్ మాస్టర్‌ కోలుకునేందుకు అన్నివిధాలుగా చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఆయన ఆరోగ్యం కోసం వైద్యులు ఎంతగానో శ్రమిస్తున్నారు. మాస్టర్‌ రెండో కుమారుడు అజయ్‌తోనూ ఫోన్‌లో మాట్లాడాను. ఇప్పుడు ఆయన కుటుంబానికి మీ ప్రార్థనలు ఎంతో అవసరం’’ అని విష్ణు ట్వీట్‌ చేశారు.
 
 
కరోనా బారిన పడి గడిచిన నాలుగు రోజుల నుంచి హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో శివశంకర్‌ మాస్టర్‌ చికిత్స  పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమంగా ఉంది. ఆయన సతీమణి, పెద్ద కుమారుడికి సైతం వైరస్‌ సోకింది. ప్రస్తుతం ఆయన కుమారుడు అపస్మారక స్థితిలో ఉండగా, సతీమణి హోం క్వారంటైన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రి బిల్లులు చెల్లించడంలో మాస్టర్‌ కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకున్న సోనూసూద్, ధనుష్‌ తమ వంతు సాయం అందించేందుకు ముందుకు వచ్చారు. కానీ, ఇక్క‌డ మాత్రం తెలుగు హీరోల‌లో ఎలాంటి స్పంద‌నా లేదు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు