సూపర్ స్టార్ మహేష్ బాబు భరత్ అనే నేను సినిమాతో బ్లాక్‌బష్టర్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం తన 25వ సినిమా కోసం రెడీ అవుతున్నారు మహేష్. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందే ఈ భారీ చిత్రాన్ని అశ్వనీదత్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో మహేష్ సరసన పూజా హేగ్డే నటిస్తోంది. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోన్న ఈ సినిమా ఈనెల రెండో వారంలో సెట్స్ పైకి వెళ్లనుంది.
ఇదిలావుంటే... మహేష్ బాబు 25వ సినిమాలో కొత్త గెటప్ లో కనిపించనున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా మహేష్ కొత్త ఫోటోలు లీకయ్యాయి. ఈ ఫోటోల్లో ఉన్న మహేష్ లుక్ తాజా చిత్రంలోనిది అంటూ ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రాయలసీమ బ్యాక్ డ్రాప్‌లో రూపొందుతోన్న ఈ చిత్రానికి రాజసం అనే టైటిల్ అనుకుంటున్నట్టు టాక్ వినిపించింది.