రోజులు గడిచిపోతున్నాయ్... పరిస్థితులు మారడం లేదు : మహేష్ బాబు

ఆదివారం, 1 డిశెంబరు 2019 (13:59 IST)
హైదరాబాద్ నగరంలో పశువైద్యురాలు ప్రియాంకా రెడ్డి అత్యాచారం, హత్య కేసుపై టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు స్పందించారు. ఈ హత్య కేసుపై ఆయన తనలోని ఆవేదనను ఓ కవిత రూపంలో వెల్లడించారు. ఇదే విషయంపై ఆయన ట్విట్టర్‌లో మరోసారి స్పందిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఓ విజ్ఞప్తి చేశారు. 
 
"రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతూనే ఉన్నాయని, సమాజంలో పరిస్థితులు మాత్రం మారడం లేదని, ఉన్నత విలువలను సాధించడంలో విఫలమవుతున్నామని" ట్వీట్ చేశారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఓ విన్నపం చేస్తున్నానని తెలిపారు. ఇలాంటి భయంకరమైన నేరాలను అరికట్టడానికి మరిన్ని కఠిన చట్టాలు తేవాల్సిన అవసరం ఉందని అన్నారు. 
 
బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని మహేశ్ బాబు పేర్కొన్నారు. అందరం కలిసి మహిళలకు అండగా నిలుద్దామని, దేశాన్ని సురక్షితంగా మార్చుదామని మహేశ్‌ ట్వీట్లు చేశారు. ఈ ట్వీట్లకు పీఎంవో, మంత్రి కేటీఆర్‌ను ట్యాగ్‌ చేశారు. కాగా, ఈ కేసులో నిందితులకు శిక్షపడేలా చూస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా వ్యాఖ్యానించిన విషయం తెల్సిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు