మహేష్‌ బాబుకు.. ఆగస్టు నెల విజయాలు!

బుధవారం, 3 ఆగస్టు 2016 (21:02 IST)
మహేష్‌ బాబుకు ఈ ఏడాది ఆగస్టు నెల బాగా కలిసి వచ్చినట్లు కన్పిస్తుంది. ఫ్యాన్స్‌ కూడా అందుకు ఏదో చేయాలని ప్లాన్‌లో వున్నారు. ఎందుకంటే ఆగష్టు 9న మహేష్‌ పుట్టినరోజు. దీనికిముందు ఆగష్టు 7న  'శ్రీమంతుడు' సినిమా ఏడాది పూర్తి చేసుకుంటుంది. 10న 'అతడు' సినిమా 11 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం, 11న 'అర్జున్‌' సినిమా 12 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం.. ఇలా ఇవన్నీ ఒకే నెలలో కలిసిరావడంతో.. మహేష్‌కు అభిమానులు పెద్దఎత్తున ఏదైనా కార్యక్రమం చేయాలని చూస్తున్నారు.
 
ఇదికాకుండా.. ఆగష్టు 31న మహేష్‌ కుమారుడు గౌతమ్‌ కష్ణ పుట్టినరోజు. అదేవిధంగా మురుగదాస్‌ దర్శకత్వంలో చేస్తున్న సినిమా కూడా ఈ నెలలోనే సెట్‌పైకి వెళుతుంది. దీనికి సంబంధించిన స్టిల్‌ కూడా గౌతమ్‌ పుట్టినరోజు నాడే విడుదల చేయలనే ప్లాన్‌లో కూడా వున్నారని తెలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి