'మా' ఎన్నికలు : నేడు ప్యానెల్‌ను ప్రకటించినున్న మంచు విష్ణు

గురువారం, 23 సెప్టెంబరు 2021 (11:05 IST)
మా’ అధ్య‌క్ష (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్)ఎన్నికల అంశం తెరపైకి వచ్చినప్పటి నుంచి గతంలో ఎన్నడూ లేని విధంగా ఆసక్తికరంగా మారాయి. అక్టోబర్ 10వ తేదీన ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో అధ్యక్ష ఎన్నికల బరిలో నిలుస్తున్న మంచు విష్ణు తన ప్యానెల్ గురువారం ప్రకటించనున్నారు. 
 
‘మా’ ఎన్నికల్లో అధ్యక్షుడిగా మంచు విష్ణు పోటీ చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం మంచు విష్ణు ప్యానెల్‌లో రఘుబాబు జనరల్ సెక్రటరీగా పోటీ చేయనున్నారు. బాబూమోహన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా పోటీ చేయబోతున్నారు.
 
మరోవైపు, విష్ణు ప్యానెల్‌కు ‘మా’ మాజీ అధ్యక్షుడు నరేశ్ మద్దతు ప్రకటించారు. మంచు విష్ణు తన ప్యానెల్‌లో ఎవరెవరికి అవకాశమిస్తారనేది ఇపుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. మా కోసం ప్రత్యేక భవనం ఉండాలనే అంశాన్ని ఎజెండాగా పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేస్తున్న విషయం తెల్సిందే.
 
మరోవైపు, ఎన్నికల బరిలో నిలుస్తున్న మరో అభ్యర్థి ప్రకాశ్ రాజ్ ఇప్పటికే తన ప్యానెల్ ను ప్రకటించారు. ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి జీవితారాజశేఖర్ జనరల్ సెక్రటరీగా పోటీ చేస్తున్నారు. నిర్మాత బండ్ల గణేశ్ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు