నందమూరి హీరో కళ్యాణ్ తాజా చిత్రం "ఎమ్మెల్యే" (మంచి లక్షణాలున్న అబ్బాయి). ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్. ఉపేంద్ర మాధవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను, ఈ నెల 23వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.
నిర్మాతగా 'జై లవకుశ' సినిమాతో భారీగా లాభాలు గడించిన కళ్యాణ్ ఇపుడు.. తన ఎమ్మెల్యేగా ప్రేక్షకుల ముందుకురానున్నారు. మాస్ లోను... యూత్‌లోను ఈ సినిమాకి క్రేజ్ పెరగడంతో, ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్‌లో జరిగిందనే టాక్ వినిపిస్తోంది.
ఇందులోభాగంగా, ఈ వ్యాపారం ఏకంగా రూ.22 కోట్ల వరకు జరిగినట్టు సమాచారం. ఒక్క నైజామ్‌లోనే ఈ సినిమా 4.2 కోట్లకు.. ఓవర్సీస్‌లో 5 కోట్లకు అమ్ముడవడం విశేషం. భారీస్థాయిలో చేస్తోన్న ప్రమోషన్స్.. భారీ ఓపెనింగ్స్‌ను తెచ్చిపెడతాయని భావిస్తున్నారు.