మంత్ ఆఫ్ మధు గొప్ప థియేటర్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది: నిర్మాత యశ్వంత్

శనివారం, 30 సెప్టెంబరు 2023 (17:48 IST)
Producer Yashwant
నవీన్ చంద్ర, స్వాతిరెడ్డి ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం 'మంత్ ఆఫ్ మధు”. విమర్శకుల ప్రశంసలు పొందిన భానుమతి & రామకృష్ణ చిత్రాన్ని అందించిన దర్శకుడు శ్రీకాంత్ నాగోతి ఈ చిత్రానికి రచన, దర్శకత్వం వహించగా, యశ్వంత్ ములుకుట్ల క్రిషివ్ ప్రొడక్షన్స్, హ్యాండ్‌పిక్డ్ స్టోరీస్ బ్యానర్‌ పై నిర్మిస్తున్నారు. సుమంత్ దామ సహ నిర్మాతగా, రఘువర్మ పేరూరి ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం అక్టోబర్ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపధ్యంలో నిర్మాత యశ్వంత్ చిత్ర విశేషాలని పంచుకున్నారు.
 
మంత్ ఆఫ్ మధు కథని మీ కోణంలో ఏమని చెబుతారు ?
'మంత్ ఆఫ్ మధు' ఒక లైఫ్ డ్రామా. ప్రతి ఒక్కరి లైఫ్ లో హనీమూన్ పీరియడ్ వుంటుంది. అది బ్యూటిఫుల్ గా వుంటుంది. ఐతే అది లైఫ్ లాంగ్ వుండాలని లేదు. దీనితో పాటు ఎత్తుపల్లాలు ఉంటాయనేది వాస్తవం. ఈ వాస్తవాన్ని చూపించే ప్రయత్నం చేసేది ఈ చిత్రం.
 
మంత్ ఆఫ్ మధు థియేటర్ గొప్ప ఎక్స్ పీరియన్స్ ఇచ్చే సినిమా. దాదాపు అన్నీ లైవ్ లోకేషన్స్ తో సింక్ సౌండ్ తో షూట్ చేశాం. చాలా ఎఫర్ట్  పెట్టాం. అచ్చురాజమణి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఆడియన్స్ కి ఖచ్చితంగా ఒక డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. ముఖ్యంగా ఈ సినిమా స్క్రీన్ ప్లే చాలా కీలకంగా వుంటుంది,. రవికాంత్ గారు అద్భుతంగా చేశారు.
 
భానుమతి & రామకృష్ణ నవీన్ చంద్రగారితో చేశారు.. మళ్ళీ ఈ సినిమా ఆయనతో చేయడానికి కారణం ?
డైరెక్టర్ శ్రీకాంత్,  హర్ష.. ఇలా మా టీం అంతా దాదాపు రెగ్యులర్ గా కలిసే క్లోజ్ ఫ్రెండ్స్. నవీన్ గారికి ఈ కథ చెప్పినపుడు ఆయన చాలా నచ్చింది. ఈ కథకి సరిపోయే మంచి ఫెర్ ఫార్మార్ తను. తర్వాత స్వాతి గారు ప్రాజెక్ట్ లోకి వచ్చారు. ఇద్దరు బెస్ట్ పెర్ఫార్మర్స్ చేరిన తర్వాత ప్రాజెక్ట్ మరింత ఎక్సయిటెడ్ గా అనిపించింది.
 
భానుమతి & రామకృష్ణ  లాంటి విజయం తర్వాత ఇంత సమయం తీసుకోవడానికి కారణం ?
మంచి కంటెంట్ ఇవ్వడంపైనే మా దృష్టి వుంటుంది. కథ నుంచి ప్రతి విషయంపై జాగ్రత్త తీసుకుంటాం. సినిమాకి సంబధించిన ప్రతి ప్రాసెస్ ని ఎంజాయ్ చేస్తాను. సినిమాలని త్వరగా చేసేయడం కంటే ఒక మంచి కంటెంట్ ప్రోడ్యుస్ చేసే జర్నీని చాలా ఆస్వాదిస్తాను.
 
మధు పాత్రకు శ్రేయాని తీసుకోవడానికి కారణం ఏమిటి ?
ఈ పాత్రకు అమెరికా నుంచి వచ్చిన అమ్మాయి కావాలి. అదే సమయంలో నటన వచ్చివుండాలి. అలా శ్రేయాని తీసుకోవడం జరిగింది. ఈ పాత్రను తను చాలా అద్భుతంగా చేసింది.
 
అక్టోబర్ 6 సినిమాలు ఎక్కువ వున్నాయి కదా ?
సినిమాలు ఎక్కువ వున్నప్పటికీ థియేటర్స్ సమస్య లేదు. సినిమాలు నాలుగున్నా మన ఆడియన్స్ ఎవరు అనేది ఎంపిక చేసుకోవడం చాలా ముఖ్యం. మా ఆడియన్స్ ని ఎంపిక చేసుకున్నాం. మా జోనర్ చాలా డిఫరెంట్. ట్రైలర్ విడుదలైన తర్వాత మరింత బజ్ పెరిగడం ఆనందంగా వుంది. బిజినెస్ పరంగా చాలా హ్యాపీ గా వున్నాం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు