కోడలిపై టాలీవుడ్ మన్మథుడి క్రేజీ ట్వీట్

మంగళవారం, 21 మే 2019 (17:56 IST)
టాలీవుడ్ గ్రీకువీరుడిగా పేరు తెచ్చుకున్న అక్కినేని నాగార్జునకు మన్మథుడిగా మరో పేరు తెచ్చిన సినిమా మన్మథుడు. నాగార్జున కెరీర్‌లో మరుపురాని సినిమాలలో ఇది కూడా ఒకటి. ఇటీవల ఆ సినిమాకు సీక్వెల్‌గా మన్మథుడు 2ని తెరకెక్కిస్తున్నారు.


రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ పోర్చుగల్‌లో భారీ స్థాయిలో జరిగింది. ఇక పోర్చుగల్‌లో షూటింగ్ షెడ్యూల్‌ను ముగించుకొని సినిమా యూనిట్ తిరిగి వచ్చిన ఈ సందర్భంగా నాగార్జున చేసిన ట్వీట్ ఆసక్తకరంగా మారింది.
 
ఈ సినిమాలో గ్లామరస్ హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, సమంత అక్కినేని, కీర్తీ సురేష్ నటిస్తున్నారు. ఈ సినిమాలో పూర్తి స్థాయి హీరోయిన్‌గా రకుల్ కనిపిస్తారు. ఇక సమంత, కీర్తీ సురేష్ అతిథిపాత్రలు చేసినప్పటికీ.. సినిమాకు ఎంతో కీలకమైనవని పేర్కొన్నారు. సమంతపై పోర్చుగల్‌లో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను కూడా చిత్రీకరించారు.

సమంత అక్కినేని గురించి నాగార్జున ట్వీట్ చేస్తూ.. మన్మథుడు 2 సినిమాలో కోడలు పిల్లతో షూటింగ్ చేయడం చాలా సరదాగా సాగిపోయింది. ఇంకా మరికొన్ని ఫోటోలను షేర్ చేస్తానంటూ నాగార్జున ట్వీట్ చేశారు.

మన్మథుడు సినిమా షూటింగ్ ఇప్పటి వరకు 70 శాతం పూర్తయింది. ఇప్పటిదాకా వచ్చిన అవుట్‌పుట్‌పై సినిమా బృందం సంతోషంగా ఉందట. ఈ సినిమా పనులను శరవేగంగా పూర్తి చేసి ఆగస్టులో విడుదల చేయాలనేది యూనిట్ ప్లాన్.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు