రోడ్డుపై ఆవులు.. టూవీలర్‌పై వచ్చిన వ్యక్తిపై ఎక్కి దిగిన బస్సు.. ఎక్కడ?

సెల్వి

శనివారం, 22 జూన్ 2024 (20:10 IST)
Bus
రోడ్డు ప్రమాదాలు దారుణంగా జరుగుతున్నాయి. అతి వేగంతో రోజుకు లెక్కలేనన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్ని అనూహ్యంగా జరుగుతూ మానవుల ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. అలాంటి ఘటనే ప్రస్తుతం తమిళనాడు, తిరునెల్వేలిలో చోటుచేసుకుంది. 
 
తిరునెల్వేలి రోడ్డుపై ఆవులు కొమ్ములతో కొట్లాడుకున్నాయి. ఈ ఆవుల కొట్లాటలో ఓ కోర్టులో పనిచేసే ఉద్యోగి ప్రాణాలు కోల్పోయాడు. టూవీలర్‌పై వస్తున్న వేలాయుధం అనే కోర్టు ఎంప్లాయ్‌ను ఆవులు కొమ్ములతో కిందకు తోశాయి. 
 
అయితే ఎదురుగా వచ్చిన బస్సు చక్రాలు వేలాయుధంపై ఎక్కి దిగాయి. ఈ ఘోరమైన ఘటనలో వేలాయుధం తీవ్రగాయాలతో అక్కడికక్కడే మరణించాడు. 
 
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

#JUSTIN நெல்லையில் சாலையில் சண்டையிட்ட 2 மாடுகளால் நீதிமன்ற ஊழியர் பலி#Roadaccident #Nellai #Cow #News18Tamilnadu | https://t.co/3v5L32pe7b pic.twitter.com/IB5NHDsqbs

— News18 Tamil Nadu (@News18TamilNadu) June 22, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు