స్వర్గీయ ఎన్.టి.రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం "ఎన్టీఆర్ బయోపిక్". రెండు భాగాలుగా రానున్న ఈ చిత్రం ఆడియో, ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ వేదికగా జరిగింది. ఇందులో ఎన్టీఆర్ కుమార్తెలు పాల్గొని, ట్రైలర్‌ను విడుదల చేశారు.
ఈ సభా ముఖంగా మా తమ్ముడు బాలయ్య, దర్శకుడు క్రిష్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ సినిమా ద్వారా మా అబ్బాయి శ్రీనివాస్‌ను కూడా పెద్ద తమ్ముడు సాయికృష్ణ పాత్రలో నటింపజేశారు. సుమంత్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. 'మీ తాతగారులేని లోటును నువ్ తీర్చావ్ బాబు'" అని లోకేశ్వరి అని అన్నారు. దీనికి సుమంత్ లేచి నిలబడి సభకు వినమ్రయంగా నమస్కరించారు.