నేచురల్ స్టార్ నాని కృష్ణార్జునయుద్ధం సినిమా ఫలితంతో ఆలోచనలో పడ్డాడు. ఇక నుంచి ఆచితూచి సినిమాలు చేయాలి అనుకుంటున్నాడు. దీంతో చాలామంది దర్శకులు నానితో సినిమా చేసేందుకు ఇంట్రస్ట్ చూపించినప్పటికీ... కొత్త కథలు అయితేనే చేస్తానని చెబుతున్నాడట. ఇలా చాలా కథలు విన్న నాని ఆఖరికి మళ్లీ రావా డైరెక్టర్ గౌతమ్ చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్ పైన నాగవంశీ నిర్మించనున్నారు.
ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియచేస్తూ… పోస్టర్ రిలీజ్ చేసారు. ఈ పోస్టర్‌ను బట్టి ఇది క్రికెట్ నేపథ్యంలో సాగే కథ అని.. నాని ఈ సినిమాలో క్రికెటర్‌గా కనిపించనున్నాడని తెలుస్తోంది. ఈ మూవీకి ‘జెర్సీ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇది నానికి 23వ సినిమా. మరి... నాని 25వ సినిమాని ఎవరితో చేస్తాడో అనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం నాని నాగార్జునతో కలిసి చేస్తోన్న సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా వినాయక చవితి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.