నితిన్ హీరోగా నటించే శ్రీనివాస కల్యాణం సినిమా కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని సతీశ్ వేగేశ్న (శతమానం భవతి ఫేమ్) రూపొందించారు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. నితిన్, రాశిఖన్నా జంటగా నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం హైదరాబాదు, ఆపై అమలాపురంలో జరిగే షూటింగ్‌తో ఈ సినిమా పూర్తవుతుంది.