పవన్ కళ్యాణ్ 'కాటమరాయుడు' చిత్రం నైజాం ఏరియాలో పోటీ వున్నా దిల్ రాజును కాదని నితిన్ దక్కించుకోవడం విశేషం. సొంత సంస్థ శ్రేష్ట్ మూవీస్ పైన ఆసియన్ ఫిలిమ్స్‌తో కలిసి ఈ హక్కుల్ని తీసుకుని నైజాంలో చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేయనున్నాడు నితిన్. నితిన్ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా స్వయంగా ప్రకటించాడు. ఇకపోతే డాలి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని మార్చి నెలలో విడుదల చేసే అవకాశముంది.
కాగా ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రలలో అలీ, నాజర్, రావు రమేష్, అజయ్, నర్రా శ్రీను, పృథ్వి, శివబాలాజీ, కమల్ కామరాజు, చైతన్య కృష్ణ, తరుణ్ అరోరా, ప్రదీప్ రావత్, పవిత్ర లోకేష్, రజిత, యామిని భాస్కర్, అస్మిత, రమాదేవి, భానుశ్రీ నటిస్తున్నారు. నార్త్ స్టార్ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై నిర్మితమవుతున్న ఈ కాటమరాయుడు చిత్రానికి సంగీతం అనూప్ రూబెన్స్, ప్రసాద్ మూరెళ్ళ కెమెరామన్‌గా వర్క్ చేస్తున్నారు. నిర్మాత: శరత్ మరార్, దర్శకత్వం: కిషోర్ పార్ధసాని.