ప్రముఖ దర్శకుడు, బాహుబలి మేకర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మల్టీస్టారర్ సినిమా రూపుదిద్దుకోనుంది. ఈ సినిమా అక్టోబరులో ప్రారంభం కానుందని టాక్ వస్తోంది. ఈ గ్యాప్‌లో త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సినిమా మొదలెట్టేశాడు. ఇటీవల పవన్ కల్యాణ్ చేతుల మీదుగా త్రివిక్రమ్, జూనియర్ ఎన్టీఆర్ సినిమా పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.
శుక్రవారం మొదలెట్టిన ఈ షెడ్యూల్ ఈ నెల 25వరకూ కొనసాగనుంది. ఈ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డేను ఖరారు చేయగా, దసరాకు ఈ సినిమా రిలీజ్ కానుంది. కాగా ఇప్పటికే రాజమౌళితో సినిమా చేసేందుకు సిద్ధంగా వున్నట్లు జూనియర్ ఎన్టీఆర్ ప్రకటించారు. ఈ సినిమా కోసం కథ కూడా వినకుండా జక్కన్నకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని జూనియర్ ఎన్టీఆర్ ప్రకటించారు.