ఎన్టీఆర్ గురించి ఇంటర్ ఫస్టియర్ క్వశ్చన్ పేపర్‌లో ప్రశ్న

మంగళవారం, 10 మే 2022 (19:39 IST)
'ఆర్ఆర్ఆర్' సినిమాలో కొమరంభీం పాత్రలో తన యాక్టింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఎన్టీఆర్‌తో.. మీరు ఓ రిపోర్టర్‌గా ఇంటర్వ్యూ చేసి ప్రశ్నలు అడిగి.. సమాధానాలు తెలుపుతూ ఓ వ్యాసం రాయండి' అని ప్రశ్న ఇంటర్ ఫస్టియర్ ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్‌లో అడిగారు. ఈ ప్రశ్న నెట్టింట వైరల్ అవుతోంది. 
 
ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్‌లో 'ఆర్ఆర్ఆర్' లోని కొమరంభీం పాత్రలో నటించిన జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రశ్న అడిగారు. ఎన్టీఆర్ గురించి ఎగ్జామ్‌లో క్వశ్చన్ రావడంతో అభిమానులు ప్రశ్నాపత్రాన్ని ట్వీట్ చేస్తూ.. వైరల్ చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు