బాలీవుడ్ సింగర్ కేకే హఠాన్మరణం - ప్రధాని మోడీ సంతాపం

బుధవారం, 1 జూన్ 2022 (07:19 IST)
బాలీవుడ్ చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖ సింగర్ కృష్ణకుమార్ అలియాస్ కేకే హఠాన్మరణం చెందారు. ఆయన వయసు 53 యేళ్ళు. సంగీత ప్రపంచానికి కేకేగా చిరపరిచితమైన ఆయన కోల్‌కతాలోని నజురుల్ మంచా ఆడిటోరియంలో ప్రదర్శన ఇచ్చారు. ఆ తర్వాత హోటల్‌కు చేరుకున్న తర్వాత ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆ వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించినప్పటికీ లాభం లేకుండా పోయింది. ఆయన్ను పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. 
 
కాగా, కేకే గత 1990లలో 'పాల్', 'యూరోన్' సినిమాల్లో ఆయన పాడిన పాటలు సంచలనం సృష్టించాయి. యువతలో ఆయన పాటలకు విపరీతమైన క్రేజ్ ఉండేది. స్కూల్, కాలేజీ, కల్చరల్ ఈవెంట్స్‌లలో ఎక్కువగా ఈ పాటలే వినిపించేవి. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ ఇలా అనేక భాషల్లో ఆయన పాటలు పాడారు. 
 
కాగా, కేకే మరణవినగానే ఆయన అభిమానులు, సన్నిహితులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆయన మృతికి సంతాపం ప్రకటిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. ముఖ్యంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం కేకే మృతిపట్ల తన ప్రగాఢ సంతాపాన్ని, ఆయన కుటుంబ సభ్యులకు తన సానుభూతిని తెలుపుతూ ట్వీట్ చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు