చందమామ కాజల్ అగర్వాల్ నటన, గ్లామర్ పంట గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దక్షిణాదిన టాప్ హీరోయిన్‌గా కొనసాగుతున్న కాజల్ అగర్వాల్.. ముంబై వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును ఇటీవల పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
తాజాగా ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు ప్రభుదేవతో మొదటిసారిగా జతకట్టనున్నట్లు తెలుస్తోంది. తమిళ చిత్రం గులేబకావలి ఫేం డి. కల్యాణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ రొమాంటిక్, కామెడీ, థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కనుందట.