ప్రణయ గోదారి గ్లింప్స్, పోస్టర్లు, పాటలు ఆడియెన్స్‌లో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. తాజాగా మరో పాటను చిత్రయూనిట్ విడుదల చేసింది. తెల్లారుపొద్దుల్లో అంటూ సాగే ఈ మెలోడియస్, రొమాంటిక్ పాటను ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ రిలీజ్ చేశారు. ఈ పాటకు మార్కండేయ బాణీ, సాహిత్యం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచేలా ఉన్నాయి. ధనుంజయ్, అదితి భావరాజు ఆలపించిన ఈ పాట ఎంతో శ్రావ్యంగా ఉంది.