ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'ఇప్పుడే పాట విన్నాను.. చూడకయ్యో.. నెమలికళ్ళ తూగుతున్న తూనీగల్లా అనే పల్లవితో కొనసాగే ఈ పాటలో మంచి సాహిత్యం, సంగీతం వుంది. మార్కండేయ ఈ పాటకు చక్కని సాహిత్యంతో పాటు ఆకట్టుకునే స్వరకల్పన చేశాడు. చక్కటి జానపద సాహిత్యం ఇది. అందరికి చేరువయ్యే తేలికైన మాటలతో.. వినగానే రసానుభూతి కలిగించేలా మంచి సాహిత్యం అందించారు. పాట బాణీతో పాటు నడక, దాని వెనకాల వచ్చే బీట్ కూడా నాకు బాగా నచ్చింది. గాయనీ సునీత, సాయిచరణ్ తన గాత్రంతో పాటకు జీవం పోశారు. నాకు ఈ మధ్య కాలంలో అమితంగా నచ్చిన పేరు 'ప్రణయగోదారి' టైటిల్ చాలా కవితాత్మకంగా వుంది. చిత్రం కూడా అంతే వుంటుందని అనుకుంటున్నాను. తప్పకుండా ఈ పాటతో పాటు చిత్రం కూడా విజయవంతం అవ్వాలని ఆశిస్తున్నాను' అన్నారు.
ప్రణయ గోదావరి గ్లింప్స్, పోస్టర్లు, పాటలు ఆడియెన్స్‌లో మంచి బజ్‌ను క్రియేట్ చేస్తుండగా...తాజాగా విడుదల చేసిన చూడకయ్యో.. నెమలికళ్ళ తూగుతున్న తూనీగల్లా అనే బ్యూటీఫుల్ మెలోడి పాట వినగానే ఆకట్టుకునే విధంగా వుంది. ముఖ్యంగా పాట బాణీలు, సాహిత్యం ఎంతో చక్కగా కుదిరాయి. చాలా కాలం తరువాత జానపద సాహిత్యం మేళవించిన మెలోడి పాటను విన్న ఫీల్ కలుగుతుంది. ఈ పాట కుర్రకారుతో పాటు పాటల ప్రియుల అందర్ని కట్టి పడేసేలా ఉంది. ఈ పాట విన్నవాళ్లకి తప్పకుండా సినిమా చూడాలనే ఆసక్తి కలుగుతుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.