అయితే ఆ రోజున ప్రధాని సమావేశానికి వెళ్లిన సందర్భంగా ప్రియాంక చోప్రా దుస్తులు మార్చుకునేందుకు సమయం లేకపోవడం వల్లే.. అలా వెళ్ళిందని.. ప్రోటోకాల్ అధికారుల సూచన మేరకే ప్రధానిని ప్రియాంకా చోప్రా కలిసిందని ప్రియాంక చోప్రా తల్లి మధు వెల్లడించింది. కానీ ప్రియాంక మాత్రం కురుచ దుస్తులపై కామెంట్ చేసిన నెటిజన్లకు సమాధానంగా కురచ దుస్తులు ధరించిన మరో ఫోటోను ప్రియాంక పోస్టు చేసింది. అయితే ఈ వివాదంపై ప్రియాంక తాజాగా నోరి విప్పింది.
ప్రస్తుతం ముంబైలో ఉన్న ప్రియాంక ఓ న్యూస్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నెటిజన్లకు ఏం చేసినా తప్పుగానే కనిపిస్తుందని.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసే నెటిజన్ల హేళనకు మీడియా ఎందుకంత ప్రాధాన్యం ఇస్తుందో అర్థం కావట్లేదని చెప్పింది. ఆన్‌లైన్లో హేళన చేయడమనేది అసలు వార్త కానే కాదు. అది తన మీద వారికి ఉండే వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని హితవు పలికింది. అలాంటి కామెంట్లను తానేమీ పట్టించుకోనని ప్రియాంక వెల్లడించింది.