'అధినేత', 'ఏమైంది ఈవేళ', 'బెంగాల్‌టైగర్' వంటి సూపర్‌హిట్ చిత్రాల్ని నిర్మించిన శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె. రాధామోహన్ 'ఓ చినదాన', 'ఒట్టేసి చెబుతున్నా', 'తిరుమల తిరుపతి వెంకటేశ', 'ఏవండోయ్ శ్రీవారు', 'యముడికి మొగుడు', 'బెట్టింగ్ బంగార్రాజు' వంటి సూపర్‌హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన ఇ.సత్తిబాబు దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ఫస్ట్ షెడ్యూల్ ఆగస్టు 12వ తేదీతో పూర్తయింది.
ప్రస్తుతం రెండో షెడ్యూల్ జరుగుతోంది. ఈ సందర్భంగా నిర్మాత కె.కె. రాధామోహన్ మాట్లాడుతూ, ''హిలేరియస్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. ఆగస్టు 12వ తేదీ వరకు జరిగిన మొదటి షెడ్యూల్‌తో 60 శాతం షూటింగ్ పూర్తయింది. ఆగస్టు 16వ తేదీన రెండో షెడ్యూల్ స్టార్ట్ అయింది. నాన్‌స్టాప్‌గా జరిగే రెండో షెడ్యూల్‌తో టోటల్‌గా షూటింగ్ పార్ట్ పూర్తవుతుంది.
ఈ చిత్రంలో నవీన్ చంద్ర, శృతి సోది జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో పృథ్వీ, సలోని, జయప్రకాష్‌రెడ్డి, పోసాని కృష్ణమురళి, మురళీశర్మ, రఘుబాబు, ప్రభాస్ శ్రీను, చమ్మక్ చంద్ర, పిళ్ళా ప్రసాద్, విద్యుల్లేఖా రామన్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.