ఇదిలా ఉంటే.. ఫేస్‌బుక్‌లో ఎప్పుడూ అప్‌డేట్స్ ఇస్తూ ఉండే పృథ్వీ ఒక్క పోస్ట్‌తో మరో సంచలనానికి తెరలేపాడు. ‘‘మెగాస్టార్ గారి 150వ మూవీలో నటించడం నా అదృష్టం. సీన్స్ తీసివేయడం నా దురదృష్టం. సంక్రాంతి రోజున మా మదర్ చనిపోయినంత బాధగా ఉంది’’. అంటూ పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ చూసిన వారంతా అవాక్కయ్యారు. పృథ్వీ ఎందుకింత ఎమోషనల్ అయ్యాడో ఎవరికీ అర్థం కాలేదని మాట్లాడుకున్నారు.
సినిమాలో సీన్స్‌కు, తల్లి చావుకు ముడిపెట్టడమేంటని పృథ్వీపై కొందరు నెటిజన్లు మండిపడుతున్నారు. అయితే ఈ పోస్ట్ పెట్టడంపై పృథ్వీ స్పందించాడు. ఖైదీ నెం.150 సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ దొరికినా చాలనుకున్నానని, అలాంటిది మంచి పాత్ర దొరకడంతో ఎంతో సంతోషపడ్డానని వెల్లడించాడు. కానీ తాను నటించిన సీన్స్ తీసేయడంతో చాలా బాధపడినట్లు చెప్పుకొచ్చాడు.
తాను ఇండస్ట్రీకి రావడానికి చిరంజీవి సినిమాలే కారణమని పృథ్వీ వెల్లడించాడు. అలాంటి హీరో సినిమాలో నటించిన సీన్‌ను తొలగించడం పెద్ద షాక్ అని చెప్పాడు. అయితే ఈ పోస్టులను పృథ్వీ కొన్ని గంటల్లో ఫేస్ బుక్ నుంచి తొలగించాడు. ఇందుకు కారణం.. బ్రహ్మానందం నటించిన 18 సీన్లని ఎలివేట్ చేశారని, ఆ కారణంగానే పృధ్వీ సీన్స్‌ని తొలగించారంటూ ఫిల్మ్‌నగర్‌లో వార్తలు షికార్లు చేస్తున్నాయి.