నా మీద మీడియాలో వస్తున్న కథనాలను చూసి ఆశ్చర్యపోయాను. ఈ ఆరోపణలకు స్పందించాల్సిన బాధ్యత నాపై వుంది కాబట్టి స్పందిస్తున్నాను. నాపై ఆ యువతి నిరాధారమైన ఆరోపణలను చేస్తూ, ఏ చట్టపరమైన వేదికను ఆశ్రయించకుండా సులభ పద్దతి అయిన సోషల్ మీడియాను వేదికగా ఎంచుకుంది. సోషల్ మీడియా ద్వారా ఎవరినైనా అపఖ్యాతి పాలు చేయడం సులభం. దానికి ఆధారాలు నిరూపించాల్సిన అవసరం లేదు అందుకే దాన్ని వేదికగా తీసుకుంది. నేను ప్రతి పాత్రికేయుడికి గౌరవం ఇస్తాను. పాత్రికేయ విలువలను గౌరవిస్తాను. అయినప్పటికీ పరువు నష్టం కలిగించే ఆధారాలు లేని ఒక ఫేస్ బుక్ పోస్ట్ ను ఆధారంగా తీసుకొని మీరు నా ఫోటోను ప్రచురిస్తూ, పరువు నష్టం కలిగించే వ్యాసాలలో నా పేరు ను ఉపసంహరించాలని అభ్యర్థిస్తున్నాను. భవిష్యత్తులో కూడా ఇలాంటి నిరాధారమైన వార్తల్లో కూడా నా పేరు ఊపయోగించకుండా వుండాలని మీడియాను కోరుకుంటున్నాను.