తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కబాలి సినిమా ద్వారా సరికొత్త రికార్డు నమోదైంది. రజనీకాంత్ కబాలి టీజర్ సోషల్ మీడియా పెను సంచలనం సృష్టించిన నేపథ్యంలో.. దీనిని క్యాష్ చేసుకునేందుకు గాను సినీ నిర్మాతలు కబాలి యాప్ను రూపొందించి సరికొత్త సంప్రదాయానికి నాంది పలికారు. ఈ యాప్ ద్వారా కబాలి సినిమాకు సంబంధించిన వివరాలను అందిస్తామని తెలిపారు.