తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ 67వ పుట్టినరోజును మంగళవారం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రజనీకి అభిమానులు, సినీ ప్రముఖులు, వివిధ రంగాలకు చెందిన ముఖ్యలంతా అభినందనలు తెలియజేస్తున్నారు. తాజాగా టాలీవుడ్ కింగ్ మోహన్‌బాబు కూడా తన స్నేహితుడు రజనీకి విషెస్ తెలుపుతూ ట్వీట్ చేశారు. రజనీ, మోహన్‌బాబు చాలా కాలంగా మంచి మిత్రులు. "హ్యాపీ బర్త్‌డే మై డియర్ ఫ్రెండ్ రజినీ.. నువ్వు నిండు నూరేళ్లు మంచి హెల్త్, వెల్త్‌తో జీవించాలని కోరుకుంటున్నా" అంటూ ట్వీట్ చేశారు.
కాగా, రజనీ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ మూవీ '2.0' సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రజనీ సరసన అమీ జాక్సన్ నటిస్తోంది. ఈ సినిమా ఏప్రిల్, 2018న ప్రేక్షకుల ముందుకురానుంది.
అలాగే, వండర్ బార్ ఫిలిమ్స్ బ్యానర్‌పై రజినీ అల్లుడు ధనుష్ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాకు పా.రంజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. రజనీ సరసన బాలీవుడ్ బ్యూటీ హ్యూమా ఖురేషి హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం చెన్నైలో షూటింగ్ జరుపుకుంటుంది. రోబో సీక్వెల్ తర్వాత కాలా ప్రేక్షకుల ముందుకురానుంది.