రకుల్ ప్రీత్ సింగ్‌కు అవమానం.. ఏం జరిగిందో తెలుసా? (Video)

గురువారం, 12 సెప్టెంబరు 2019 (11:56 IST)
టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌కు అవమానం జరిగింది. ఈ ఘటన గత ఆదివారం రోజున హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగింది. సినిమహోత్సవం పేరిట ఓ పెద్ద కార్యక్రమం జరిగిన విషయం తెలిసిందే. కాగా ఆ వేడుకలోనే రకుల్ ప్రీత్ సింగ్ కు అవమానం జరిగింది. ఈ వేడుకలో పలువురు హీరోయిన్‌లు డ్యాన్స్ షోలు చేసారు. 
 
అందులో రకుల్ ప్రీత్ కూడా డ్యాన్స్ షో చేయడానికి సిద్ధమైంది. అయితే సరిగ్గా అదే సమయానికి చిరంజీవి, మహేష్ బాబులు రావడంతో రకుల్ ప్రీత్ సింగ్‌ని పట్టించుకున్న వాళ్లే లేకుండాపోయారు. 
 
చిరంజీవి-మహేష్ బాబుల సందడితో అంతా అక్కడ కొద్దిసేపు గందరగోళం ఏర్పడింది. అయితే ఆ హడావుడి సద్దుమణిగాక డ్యాన్స్ చేయడానికి సిద్ధంగా ఉంది రకుల్ కానీ నిర్వాహకులు మాత్రం రకుల్ డ్యాన్స్ షోని అర్దాంతరంగా క్యాన్సిల్ చేసి వేదిక మీదకు చిరంజీవి, మహేష్‌లను పిలవడంతో ఘోర అవమానంగా భావించిన రకుల్ అక్కడి నుండి వెళ్లిపోయిందట.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు