న్యూజెర్సీలో జరగనున్న ఓ ఛారిటీ ఈవెంట్‌కి హీరో రామ్‌చరణ్ హాజరుకావడంలేదు. తద్వారా ఇలియానా బాటలోనే చెర్రీ కూడా నడిచాడు. ఈ విషయాన్ని ఆయన తన ఫేస్బుక్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నాడు. ఉగ్ర బాధితులకు విరాళాలు సేకరించడం కోసం జరిగే ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా చెర్రీకి ఆహ్వానం అందింది. అయితే ఫ్యామిలీలో ఓ వ్యక్తికి మెడికల్ ఎమర్జెన్సీ అవసరమైనందున రాలేకపోతున్నట్టు తెలిపాడు.
నిరాశ చెందిన తన అభిమానుల కోసం మరేదైనా చేస్తానంటూ చెర్రీ వివరణ ఇచ్చుకున్నాడు. న్యూజెర్సీలోని పీఎన్సీ ఆర్ట్ సెంటర్లో హ్యుమానిటీ యునైటెడ్ అగైనెస్ట్ టెర్రర్' ఛారిటీ పేరిట ఈ కార్యక్రమం శనివారం జరగనుంది. ఇందులో మలైకా అరోరాఖాన్, ప్రభుదేవా, సోఫీ చౌదరి నటీనటులు పాల్గొంటున్నారు. తొలుత చెర్రీ, అఖిల్, శ్రియ వెళ్తున్నట్లు వార్తలొచ్చాయి. ఇలియానాకు కూడా ఈ కార్యక్రమంలో హాజరు కావాల్సిందిగా పిలుపొచ్చింది. కానీ ఈ ప్రోగ్రామ్‌కు వెళ్తే అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్‌కు సపోర్ట్ చేసినట్లవుతుందనే కారణంతో ఇలియానా నో చెప్పింది.
బాలీవుడ్, టాలీవుడ్ నటీనటులకు అమెరికాలోనూ వేలాది మంది అభిమానులున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ట్రంప్‌కి మద్దతు తెలిపే అవకాశం ఉంటుందని భావించి ఆర్‌హెచ్‌సీ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. కానీ ఇలియానా మాత్రం ట్రంప్‌కు సపోర్ట్ చేసే ప్రసక్తే లేదని క్లారిటీ ఇచ్చేసింది.