రంగస్థలం థ్యాంక్స్ మీట్ (Video) - రూ.100 కోట్ల క్లబ్‌లో

సోమవారం, 2 ఏప్రియల్ 2018 (13:14 IST)
రంగస్థలం బ్లాక్‌బస్టర్ హిట్ చేసినందుకు ఆ చిత్రం యూనిట్ థ్యాక్స్ మీట్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో హీరో రామ్ చరణ్, దర్శకుడు కె.సుకుమార్, విలన్ జగపతిబాబుతో పాటు.. చిత్రానికి చెందిన ఇతర సభ్యులు కూడా పాల్గొన్నారు. 
 
ఇదిలావుండగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా నటించిన చిత్రం "రంగస్థలం". హీరోయిన్ సమంత. కె. సకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 30వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. 
 
ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లో కూడా కనకవర్షం కురిపిస్తోంది. ముఖ్యంగా, ఓవర్సీస్‌లో రికార్డు స్థాయి వసూళ్లను సాధించిన తెలుగు చిత్రాల జాబితాలో ఈ చిత్రం చేరిపోయింది. తొలిరోజునే 1.2 మిలియన్ డాలర్ల గ్రాస్‌ను సాధించిన ఈ సినిమా, ఆదివారానికి 2.32 మిలియన్ డాలర్లను రాబట్టింది. మరికొన్ని రోజుల్లో ఈ సినిమా 3 మిలియన్ డాలర్లను రాబట్టడం ఖాయమని అంటున్నారు. 
 
ఓవర్సీస్‌లో 'బాహుబాలి 2', 'బాహుబలి' తర్వాత ఫుల్‌రన్‌లో 'శ్రీమంతుడు' 2.87 మిలియన్ డాలర్లను సాధించి 3వ స్థానంలో నిలిచింది. మరికొన్ని రోజుల్లో ఈ స్థానాన్ని 'రంగస్థలం' కైవసం చేసుకోనుందని చెబుతున్నారు. మున్ముందు ఈ సినిమా ఇంకెన్ని రికార్డులను తిరగరాస్తుందో చూడాలి. ఇక తెలుగు రాష్ట్రాల్లో చిట్టిబాబు బాహుబలి మినహా ఇతర చిత్రాల రికార్డులను తిరగరాసేలా దూకుడు ప్రదర్శిస్తున్నాడు.

 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు