రక్తపోటు తక్కువగా ఉంటే (హైపోటెన్షన్), సాధారణ లక్షణాలు తలతిరగడం, అస్పష్టమైన దృష్టి, అలసట, తీవ్రమైన సందర్భాల్లో మూర్ఛపోవడం లేదా స్పృహ కోల్పోవడం జరుగుతుంది. లోబీపి లక్షణాల గురించి మరింత విపులంగా తెలుసుకుందాము.
తలతిరగడం అనేది చాలా సాధారణ లక్షణం, కూర్చుని పైకి లేచినా, బెడ్ పైనుంచి త్వరగా లేచినప్పుడు సంభవిస్తుంది.
శరీరానికి తగినంత ఆక్సిజన్, పోషకాలు అందకపోవచ్చు. దీని వలన అలసట, బలహీనత అనిపిస్తుంది.
తీవ్రమైన సందర్భాల్లో, తక్కువ రక్తపోటు తాత్కాలికంగా స్పృహ కోల్పోయేలా చేస్తుంది.