ఘరానా మొగుడులోని ఆ పాటంటే ఇష్టం.. పొకెమాన్ ఆడుతుంటా: రష్మీ

సోమవారం, 30 అక్టోబరు 2017 (09:06 IST)
''ఘరానా మొగుడు'' సినిమాలోని పాట తనకు చాలా ఇష్టమని ప్రముఖ సినీ నటి... యాంకర్ రష్మీ వెల్లడించింది. ఓ న్యూస్ ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో పాత చిత్రాల్లో ఏ పాటంటే ఇష్టమని అడిగిన ప్రశ్నకు రష్మీ ఇలా సమాధానమిచ్చింది. ''ఏందిబే ఎట్టాగ ఉంది ఒళ్లు...'' అనే పాట తనకు చాలా ఇష్టమని చెప్పిన రష్మీ, ఆ పాటను పాడుతూ నవ్వులు చిందించింది. పాత పాటలు అద్భుతంగా ఉంటాయని చెప్పింది. తాను ఇప్పటికీ పిల్లల్లా "పొకెమాన్" ఆడుతుంటానని, ఆ గేమ్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది. 
 
ఇక టెలివిజన్ రంగంలో బిజీగా ఉన్నాను. పరిశ్రమలో మరో పదేళ్లు ఉండాలనే ఉద్దేశంతో కెరీర్‌ను ప్లాన్ చేస్తున్నానని అందుకే సినిమాలను అంగీకరించట్లేదని తెలిపింది. తనపై వెబ్ సైట్లలో వచ్చే రూమర్లు, అఫైర్ల గురించి పెద్దగా  పట్టించుకోననని తెలిపింది. వెబ్‌సైట్లకు రాయడానికి కంటెట్ కావాలి. వాళ్లు రాస్తున్నారు. నేను ఎంజాయ్ చేస్తున్నాను. వెబ్‌సైట్లలో వచ్చే గాసిప్స్‌కు వారివద్ద ఆధారాలు లేవని వెల్లడించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు