ప్రజాధారణ ఉంటే సినిమాలు సక్సెస్ అవుతాయి. అప్పుడు హీరోలు తమను తాము పెద్దగా ఊహించుకుంటారు. అలా ఊహించుకుని చివరికి జీరో అయిన కథనాయకులు చరిత్రలో చాలా మందే ఉన్నారు. దాదాపు అలాంటి అంచుకు వెళ్ళిన హీరో రవితేజ. సినిమాలు సక్సెస్‌లు వచ్చాక.. పారితోషికం పెంచేస్తూ పోవడం.. దానికి నిర్మాత దిల్ రాజు చెక్ పెట్టడం అంతా చకచకా జరిగిపోయాయి. పైగా, ఈ విషయంలోనూ ఇద్దరి మధ్య చిన్నపాటి వాదన కూడా జరిగిందట.