శ్రీరెడ్డి... తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్ అయిన పేరు ఇది. ఒక్కో సినిమాలో ప్రతి సీన్ క్లైమాక్స్ సీన్ ఎలా ఉంటుందో.. అలా ఉంది శ్రీరెడ్డి వివాదం. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ శ్రీరెడ్డి పైన బ్యాన్ ఎత్తివేస్తూ... ఆమెకు అసోసియేషన్‌లో సభ్యత్వం ఇస్తామని... ఆమె ఎవరితో అయినా నటించవచ్చు అంటూ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పడంతో ఈ వివాదానికి ఇక్కడితో ఎండ్ కార్డ్ పడినట్టు అనుకున్నారు.
ఆయన ఎవరో కాదండోయ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. అవునండి. అవును.. ఈ విషయాన్ని శ్రీరెడ్డే చెప్పింది. రామ్‌గోపాల్ వర్మ ట్విట్టర్లో శ్రీరెడ్డిని శ్రీశక్తి అని, ఝాన్సీ లక్ష్మీభాయ్ అని ప్రశంసల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. వర్మ అలా అనడం వల్లనే తన పేరును శ్రీశక్తిగా మార్చుకున్నాను అని చెప్పింది. అదీ... శ్రీరెడ్డి శ్రీశక్తిగా మారడం వెనక ఉన్న అసలు కథ.