భారత్-వెస్టిండీస్‌ల మధ్య ముంబైలో జరుగుతున్న నాలుగో వన్డేలో ఓపెనర్ రోహిత్ శర్మ అదరగొట్టేశాడు. భారత జట్టుకు భారీ స్కోర్ నమోదు చేసుకునే విధంగా ధీటుగా ఆడాడు. మొదటి నుంచే ఆచితూచి ఆడుతూ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత చెలరేగి ఆడుతూ కేవలం 137 బంతుల్లోనే 162 పరుగులు సాధించి ఔటయ్యాడు. ఈ క్రమంలో రోహిత్ రెండు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ రెండూ క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్‌వే కావడం విశేషం.
అలాగే ఓపెనర్‌గా బరిలోకి దిగిన రోహిత్ శర్మ ఓ వైపు వికెట్లు పడుతున్నా తడబడకుండా భారత ఇన్నింగ్స్‌ను నిలబెడుతూ సెంచరీ సాధించాడు. దీంతో తన కెరీర్లో 21వ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. అయితే ఓపెనర్‌గా రోహిత్‌కు ఇది 19వ సెంచరీ. కేవలం 107 ఇన్నింగ్సుల్లోనే రోహిత్ ఈ ఘనత సాధించాడు. అంతకుముందు ఓపెనర్‌గా సచిన్ టెండూల్కర్ 115 ఇన్నింగ్సుల్లో శతకాన్ని సాధించాడు.
అతడి కంటే వేగంగా 19 సెంచరీలు సాధించి రోహిత్ ఆ రికార్డును బద్దలుగొట్టాడు. ఇలా అతి తక్కువ ఇన్నింగ్సుల్లో 19 సెంచరీలు సాధించిన భారత బ్యాట్ మెన్‌గా రోహిత్ నిలిచాడు. ఇలా ఓపెనర్‌గా అత్యధిక శతకాలు సాధించిన రికార్డు దక్షిణాఫ్రికా ఆటగాడు హషీమ్ ఆమ్లా పేరిట వుంది. అతడు 102 ఇన్నింగ్సుల్లోనే 19 సెంచరీలు పూర్తిచేసుకున్నాడు. ఆమ్లా తర్వాతి రెండో స్థానంలో రోహిత్ నిలిచాడు.