జక్కన్న బాహుబలితో ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయాడు ప్రభాస్. ప్రస్తుతం సాహో షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు ప్రభాస్. ప్రభాస్‌కు నేడు (23 అక్టోబర్) పుట్టినరోజు. డార్లింగ్ పుట్టినరోజును పురస్కరించుకుని సోషల్ మీడియాలో సినీజనులతో పాటు నెటిజన్ల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే సాహోకి సంబంధించిన టీజర్ బయటకు వచ్చేసింది. ఈ సినిమాలో ప్రభాస్ లుక్ ఎలా ఉంటుందో ఆ టీజర్లో తెలిసిపోయింది.
ఈ నేపథ్యంలో సాహోలో ప్రభాస్ ఫస్ట్ లుక్ ఎలా వుంటుందని ఎదురుచూసిన అభిమానులకు శుభవార్త. ఎందుకంటే.. యంగ్ రెబల్ స్టార్ తాజా చిత్రం 'సాహో' ఫస్ట్ లుక్ విడుదలైంది. మంచు కురుస్తున్న రాత్రి వేళ నల్లటి కోటు ధరించి, ముఖం సగం మాత్రమే కనిపించేలా ముసుగు వేసుకుని, ఫోన్‌లో మాట్లాడుతూ ఉన్న ప్రభాస్ పోస్టర్‌ను సినీ యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ నటిస్తోంది.