నేటి సాంకేతిక యుగంలో AI సాంకేతికత వినియోగం బాగా పాపులరైంది. 2016లో వచ్చిన సైన్స్ ఫిక్షన్- యాక్షన్ చిత్రం '24'లో సూర్య, నిత్యా మీనన్, సమంత రూత్ ప్రభు పలువురు నటించారు. ఈ చిత్రంలోని ఒక పాట సోషల్ మీడియాలో సంచలనం రేపుతోంది. చిన్మయి పాడిన ఈ పాటలో సూర్య-సమంత నటించిన డ్యాన్స్ వీడియో ఉంది.