ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇప్పటివరకు నేను ఎక్కువగా కామెడీ రోల్ లో నటించాను. ఇందులో మొదటి సాటి హర్రర్ వైపు అంటే సీరియస్ గా వుండే డీఫ్రెంట్ సబ్జెక్ట్ చేశాను. కొబ్బరి మట్ట,సింగం 123, పెదరాయుడు వంటి సినిమాలో ఎక్కువగా స్కూప్స్ వున్నా ఈ సినిమాలో అలాంటి స్కూప్స్ ఉండవు. ఇందులోని డైలాగ్స్ డీఫ్రెంట్ గా ఉంటాయి.
హీరోయిన్ కొత్త అమ్మాయి అయినా డ్యాన్స్ పరంగా యాక్టింగ్ పరంగా చాలా బాగా చేసింది. అలాగే నాతో పాటు జ్యోతి, బాషా, అప్పారావు నటించారు.
- ఇప్పటి వరకు నేను 12 సినిమాలు హీరోగా చేశాను. ఇప్పుడు రిలీజ్ అయ్యే సినిమా ఏడవ సినిమా ఇంకా మూడు సినిమాలు రిలీజ్ కు ఉన్నాయి. ."బ్రిలియంట్ బాబు" సన్నాఫ్ తెనాలి, "దాన వీర శూరకర్ణ", మిస్టర్ బెగ్గర్, మరియు ఒక తమిళ్ సినిమాలో హీరో గా చేస్తున్నాను అది 70% షూట్ కంప్లీట్ అయ్యింది.ఇవి కాకుండా మరి కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి వాటి వివరాలు త్వరలో తెలియజేస్తాను అన్నారు.