రావు బహదూర్ ఓ సైకలాజికల్ డ్రామా. ఓ రాజవంశం నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. ఈ చిత్రానికి రచన, దర్శకత్వం, ఎడిటింగ్ వెంకటేష్ మహా. గొప్ప విజువల్స్, భావోద్వేగాలు, చరిత్రా-సంస్కృతి కలిపిన ప్రపంచాన్ని చూపించబోతున్నారు. తెలుగు కథ గ్లోబల్ ఆడియెన్స్ కోసం రెడీ అవుతోంది.
ఈరోజు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో సత్యదేవ్‌ను అరిస్టోక్రాటిక్ డ్రెస్‌లో, చుట్టూ నెమలి పించాలు, తీగలు, చిన్న చిన్న బొమ్మల మధ్య కనిపించడం చాలా క్యురియాసిటీని పెంచింది.
సత్యదేవ్ మాట్లాడుతూ.. ఒక యాక్టర్‌గా, రావు బహదూర్ లాంటి సినిమా దొరకడం అరుదు. ప్రతి ఉదయం ఐదు గంటల మేకప్… నేను కేవలం నటించలేదు, నిజంగానే రావు బహదూర్‌గా బతికానని తెలిపారు.
కార్తీక్ పర్మార్ సినిమాటోగ్రఫీ, స్మరణ్ సాయి సంగీతం, రోహన్ సింగ్ ప్రొడక్షన్ డిజైనర్ గా వర్క్ చేస్తున్నారు.