కాగా, ఆర్యన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత కలుసుకోవడం ఇదే మొదటిసారి. అక్టోబర్ 2న అరెస్టయిన ఆర్యన్ బెయిల్ కోసం పలుమార్లు అభ్యర్థనలు పెట్టుకున్నారు. అయితే, ఈ కేసు విచారిస్తోన్న ప్రత్యేక న్యాయస్థానం మాత్రం వాటిని తోసిపుచ్చింది.
ఇదిలావుంటే, మహారాష్ట్రలో కొవిడ్ వ్యాప్తి అదుపులో ఉండటంతో అక్కడి ప్రభుత్వం నిబంధనలను సడలించింది. దీంతో జైల్లో ఉన్న వ్యక్తులు తమ వారిని కలుకునేందుకు వీలుకలిగింది. ఇప్పుడు ఇద్దరు కుటుంబ సభ్యులు ఖైదీలను కలవొచ్చు. ఈ వెసులుబాటు అనంతరమే షారుక్ కుమారుడిని కలుసుకునేందుకు వచ్చారు.